Skip to main content

UN, Red Cross Report: వాతావరణ మార్పులతో మానవ మనుగడ ప్రశ్నార్థకం

UN, Red Cross Report

వాతావరణ మార్పుల కారణంగా రానున్న దశాబ్దాల్లో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు తీవ్రమవుతాయని ఐక్యరాజ్యసమితి, రెడ్‌క్రాస్‌లు తమ తాజా నివేదికలో పేర్కొన్నాయి. ఫలితంగా ఆయా ప్రదేశాల్లో మనుషులు మనుగడ సాగించలేని పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేశాయి. దక్షిణ, నైరుతి ఆసియా, ఆఫ్రికాలోని సాహెల్‌ రీజియన్, హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపాయి. వీటి కారణంగా పెద్దఎత్తున ప్రాణనష్టంతోపాటు వలసలు, అసమానతలు పెచ్చరిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈజిప్టులో ఐరాస వాతావరణ సదస్సు(సీఓపీ) జరగనున్న నేపథ్యంలో.. ఐరాస మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం(యూఎన్‌ఓసీహెచ్‌ఆర్‌), రెడ్‌ క్రాస్, రెడ్‌ క్రీసెంట్‌లు ఇటీవల ఈ నివేదికను విడుదల చేశాయి. 

September Weekly Current Affairs (International) Bitbank: Which country hosted the SCO Summit 2022?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Oct 2022 06:53PM

Photo Stories