Skip to main content

Hand Skeletal: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం!

బ్రెజిల్‌ తీరంలో మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం బయటపడడం కలకలం రేపింది.

ఇది మరో గ్రహానికి చెందిన జీవి చెయ్యి కావొచ్చని స్థానికులు అనుమానంతో భయాందోళనకు గురయ్యారు. న‌వంబ‌ర్‌ 20న సో పౌలో స్టేట్‌లో లభించిన పొడవైన ఎముకలు మనిషి చేతి వేళ్లను పోలి ఉన్నాయి. అచ్చంగా చెయ్యి ఆకారంలోనే ఉండడం గమనార్హం. నిజానికి ఇది గ్రహాంతరవాసి హస్తం కాదని, భారీ తిమింగలం లేదా డాల్ఫిన్‌కు చెందిన ఎముకలని మెరైన్‌ బయాలజిస్ట్‌ ఎరిక్‌ కోమిన్‌ వెల్లడించారు. ఇది 18 నెలల క్రితం మరణించి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఎముకలు సముద్ర జీవి శరీరం చర్మం కింద ఉండే ఫ్లిప్సర్స్‌ అని తెలిపారు. ఈ ఫ్లిప్పర్స్‌కు ఐదు వేళ్ల లాంటి ఎముకలు ఉంటాయన్నారు. 

☛ ప్ర‌పంచ‌లోనే అత్యధిక దూరం వలసపోయే పక్షి ఇదే.. దీని ప్రత్యేక‌త‌లు మాత్రం..

Published date : 29 Nov 2022 04:38PM

Photo Stories