Peace Research Institute: పీఆర్‌ఐవో లెక్కల ప్రకారం... కరోనాతో మరణించిన వారి సంఖ్య?
ప్రపంచంలో తొలిసారిగా వెలుగు చూసిన నాటి నుంచి కేవలం రెండేళ్లలోపే కరోనా మహమ్మారి తన కరాళ నృత్య విశ్వరూపాన్ని చూపించింది. కరోనా రక్కసి కోరలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 50లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోనే శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిలెస్ నగరాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. నార్వే రాజధాని ఓస్లోలోని శాంతి అధ్యయన సంస్థ(పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓస్లో–పీఆర్‌ఐవో) వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. పీఆర్‌ఐవో తెలిపిన వివరాల ప్రకారం...
- 1950 ఏడాది నుంచి ప్రపంచంలో వేర్వేరు చోట్ల పలు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో కారణంగా నమోదైన మరణాల కంటే కూడా కోవిడ్ మరణాల సంఖ్య చాలా ఎక్కువ.
- భూమండలంపై హృద్రోగం, గుండెపోటుతర్వాత కోవిడ్ ఊహకందని స్థాయిలో ప్రాణాలను హరిస్తూ మూడో అతిపెద్ద ప్రాణాంతక వ్యాధిగా అవతరించింది.
- ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఒక్క అమెరికాలోనే 7.40లక్షలకు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
చదవండి: ఇండియా గ్రీన్ గ్యారంటీ ఇస్తామని ప్రకటించిన ఐరోపా దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్