COVID-19 vaccine: కోవిడ్ వ్యాక్సిన్లతో వైద్య సంక్షోభం!
సెప్టెంబర్ 10 న జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది.
Also read:First Synthetic Embryo: మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
ఇందులో భాగంగా డాక్టర్ గాయత్రి పండిట్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను వివరించారు. ‘‘ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిపడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలోని యెల్లోకార్డ్ సిస్టం, ఆస్ట్రేలియన్ అడ్వర్స్ ఈవెంట్ మానిటరింగ్ సిస్టం, యూరప్‌లోని యుడ్రా విజిలెన్స్ సిస్టంలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీజీ యాక్సిస్ డేటాబేస్ ద్వారా మేం గణాంకాలను సేకరించి పరిశీలించాం. ఆ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల (కోటీ 10 లక్షల) మంది కోవిడ్ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలకు లోనయ్యారు. అందులో సుమారు 70 వేల మంది వ్యాక్సినేషన్ తదనంతర కారణాలతోనే చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెప్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..’’ అని వైద్యుల బృందం పేర్కొంది.
Also read:Omicron: 'ఒమిక్రాన్ 'పై పోరుకు సరికొత్త అస్త్రం
34 దేశాల ప్రతినిధుల మద్దతు
కోవిడ్ వ్యాక్సినేషన్‌తో అంతర్జాతీయ వైద్య సంక్షోభం (ఇంటర్నేషనల్ మెడికల్ క్రైసెస్) తలెత్తుతోందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది.
Also read:Covid: కరోనా సోకిన రెండేళ్ల వరకు ఈ సమస్యలు.. : లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP