Belt and Road Initiative: ఏ రెండు ఆసియా దేశాల మధ్య రైల్వే సేవలు ప్రారంభమయ్యయి?
చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్‌ఐ)లో భాగమైన చైనా-లావోస్ రైల్వే సేవలు డిసెంబర్ 4న ప్రారంభమయ్యాయి. లావోస్ రాజధాని వియంటియన్ నుంచి చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌కు ప్రారంభమైన మొట్టమొదటి రైలు సర్వీసును రెండు దేశాల అధ్యక్షులు సిసౌలిత్, షి జిన్‌పింగ్ వీడియో లింకేజీ ద్వారా తిలకించారు. దాదాపు 6 బిలియన్ల డాలర్ల వ్యయంతో ఈ రైల్వే లైన్‌ను నిర్మించారు.
లావోస్...
రాజధాని: వియంటియన్; కరెన్సీ: లావో కిప్
ప్రస్తుత జనరల్ సెక్రటరీ, అధ్యక్షుడు: తొంగ్లౌన్ సిసౌలిత్
ప్రస్తుత ప్రధానమంత్రి: ఫంఖం విపవన్హ్
పాకిస్తాన్‌లోనూ..
బీఆర్‌ఐలో భాగంగా చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును చైనాలోని జిన్‌జియాంగ్‌తో కలిపేందుకు 60 బిలియన్ డాలర్లతో రైలు మార్గం నిర్మిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా ఈ మార్గాన్ని నిర్మించడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది.
చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనా-లావోస్ మధ్య రైల్వే సేవలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : లావోస్ అధ్యక్షుడు తొంగ్లౌన్ సిసౌలిత్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్
ఎక్కడ : లావోస్ రాజధాని వియంటియన్ నుంచి చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌కు..
ఎందుకు : చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్‌ఐ)లో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్