UNCTAD: ఐరాస అంచనాల ప్రకారం.. భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్‌పై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ) మార్చి 24న విడుదల చేసిన తన తాజా నివేదికలో పేర్కొంది. 2022పై ఇంతక్రితం 6.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను తాజాగా 4.6 శాతానికి (2 శాతానికి పైగా) తగ్గించింది. ఇంధన సరఫరాలపై సమస్యలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానాలు, వెరసి ఆర్థిక అనిస్థితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు అంచనాను ఒక శాతం అంటే 3.6 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
India capability center: ప్రాట్ అండ్ విట్నీ కేపబిలిటీ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించనున్నారు?
ఐరాస నివేదికలోని ముఖ్యాంశాలు..
- 2022 ఏడాదిలో రష్యా తీవ్ర మాంద్యాన్ని చవిచూసే పరిస్థితి ఉంది. పశ్చిమ ఐరోపా అలాగే మధ్య, దక్షిణ, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో వృద్ధిలో గణనీయమైన మందగమనం ఉంటుంది.
- రష్యా వృద్ధి 2.3 శాతం నుండి మైనస్ 7.3 శాతానికి క్షీణించింది.
- అమెరికా వృద్ధి అంచనా మూడు శాతం నుండి 2.4 శాతానికి, చైనా వృద్ధి 5.7 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గిస్తున్నాం.
- ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా పలు అభివృద్ధి చెందిన దేశాలు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేసే వీలుంది. ఆయా అంశాలు బడ్జెట్ వ్యయాల కోతలకూ దారితీయవచ్చు.
- కోవిడ్–19తో అసలే తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ప్రపంచ ఎకానమీకి ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొంది.
- పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యంత పేదలపై దుర్బలమైన తక్షణ ప్రభావం చూపుతాయి.
India Sets Export Record: 2021–22 ఏడాదిలో దేశ ఎగుమతలు ఎంత శాతం పెరిగాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 ఏడాదికి సంబంధించి భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు.. 6.7 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ)
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్‌పై తీవ్రంగా ఉంటుందని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్