Russell Reynolds Associates: పర్యావరణ అనుకూల విధానంతో ఉన్న కంపెనీల శాతం?
వచ్చే దశాబ్ద కాలంలో వ్యాపారాలకు సస్టెయినబులిటీ (పర్యావరణానికి అనుకూలంగా వ్యాపార విధానాలను మార్చుకోవడం లేదా వ్యాపారాల్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వడం) కీలకంగా మారనుందని మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ రస్సెల్ రేనాల్డ్స్ అసోసియేట్స్(ఆర్‌ఆర్‌ఏ) తెలియజేసింది. భారత్‌లో 57 శాతం కంపెనీలు పర్యావరణ అనుకూల విధానంతో ఉన్నట్టు తెలిపింది. అదే అంతర్జాతీయంగా అయితే 43 శాతం కంపెనీలే పర్యావరణ అనుకూల విధానాలతో ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. 9,500 మంది ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చింది.
ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఏడేళ్లలో మొదటిసారి బేరల్‌కు 93 డాలర్లు చేరడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధ్యతాయుత, సహేతుక ధరను భారత్ కోరుకుంటున్నట్లు రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. ఈ కమోడిటీ విషయంలో తీవ్ర ఒడిదుడుకులను నిరోధించాలని తాము చమురు ఉత్పత్తి దేశాలను కోరుతున్నట్లు తెలిపారు. దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు.
చదవండి: భారత్‌లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 57 శాతం కంపెనీలు పర్యావరణ అనుకూల విధానంతో ఉన్నాయి.
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ రస్సెల్ రేనాల్డ్స్ అసోసియేట్స్(ఆర్‌ఆర్‌ఏ)
ఎక్కడ : భారత్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్