Skip to main content

PLI scheme: ‘సోలార్‌’కు రెండో విడత పీఎల్‌ఐ.. రూ.19,500 కోట్లను ప్రకటించిన ప్రభుత్వం

అధిక సామర్థ్యాలు కలిగిన సోలార్‌ పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ స్కీమ్‌) కింద మరో రూ.19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Rs 19.5 K crore allocation for solar module PLI scheme
Rs 19.5 K crore allocation for solar module PLI scheme

దీని ద్వారా 65 గిగావాట్ల అధిక సామర్థ్యం కలిగిన సోలార్‌ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది.

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?


ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్‌ సెప్టెంబర్ 21న నిర్ణయాలు తీసుకుంది.  
దేశీ అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం మొదటి విడత రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను సోలార్‌ మాడ్యూళ్ల తయారీకి ప్రకటించింది. ఇప్పుడు దేశీ అవసరాలతోపాటు.. దేశం నుంచి ఎగుమతులు పెంచే లక్ష్యంతో రెండో విడత కింద రూ.19,500 కోట్లను ప్రకటించింది. 
ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.94,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి, పరోక్షంగా 7.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా వేస్తోంది.  

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: మిస్ దివా యూనివర్స్ 2022 ప్రతిష్టాత్మక టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 22 Sep 2022 04:57PM

Photo Stories