Electronics Manufacturing: సాన్మినా కార్పొరేషన్‌తో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) తాజాగా ఎలక్ట్రానిక్ తయారీలోకి ప్రవేశించింది. ఇందుకు వీలుగా అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఎస్‌బీవీఎల్) ద్వారా సాన్మినా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థల భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. ప్రధానంగా కమ్యూనికేషన్స్ నెట్‌వర్కింగ్, రక్షణ, ఏరోస్పేస్ తదితర హైటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హార్డ్‌వేర్‌పై దృష్టిపెట్టనున్నాయి. భాగస్వామ్య సంస్థ(జేవీ)లో ఆర్‌ఎస్‌బీవీఎల్ 50.1 శాతం వాటా పొందనుండగా.. సాన్మినాకు 49.9 శాతం వాటా లభించనుంది. సాన్మినాకు దేశీయంగా గల సంస్థలో ఆర్‌ఎస్‌బీవీఎల్ రూ. 1,670 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా జేవీలో వాటాను పొందనుంది. మార్చి 3న సాన్మినా కార్పొరేషన్, ఆర్‌ఎస్‌బీవీఎల్ సంయుక్తంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ డీల్ 2022 సెప్టెంబర్‌కల్లా పూర్తికాగలదని అంచనా.
FM Nirmala Sitharaman: ఈ–బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాన్మినా కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఎస్‌బీవీఎల్)
ఎందుకు : రెండు సంస్థల భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్