నవంబర్ 2019 ఎకానమీ
Sakshi Education
డీహెచ్‌ఎఫ్‌ఎల్ డెరైక్టర్ల బోర్డు రద్దు
తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) కంపెనీ డెరైక్టర్ల బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నవంబర్ 20న రద్దు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్‌ను ఆ కంపెనీ పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్) నియమించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో డీహెచ్‌ఎఫ్‌ఎల్ దివాలా పరిష్కార ప్రణాళిక త్వరలోనే ప్రారంభమవుతుందని ఆర్‌బీఐ ప్రకటించింది.
రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను (హెచ్‌ఎఫ్‌సీలు) దివాలా చట్టం (ఐబీసీ) కింద పరిష్కార చర్యల కోసం ఎన్‌సీఎల్‌టీకి ప్రతిపాదించే అధికారాన్ని ఆర్‌బీఐకి కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గతవారం నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే డీహెచ్‌ఎఫ్‌ఎల్ విషయంలో ఆర్‌బీఐ తన అధికారాల అమలును ఆరంభించింది. దీంతో దివాలా చర్యల పరిష్కారానికి వెళ్లనున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీ డీహెచ్‌ఎఫ్‌ఎల్ కానుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను రాజేష్ కుమార్ వాధ్వాన్ 1984లో ప్రారంభించారు. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు గృహ రుణాలిచ్చే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) కంపెనీ డెరైక్టర్ల బోర్డు రద్దు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్నందున
ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్ పోర్టల్ ప్రారంభం
‘ఇన్‌కమ్ ట్యాక్స్ ఎక్స్‌ఛేంజ్ ఇన్ఫర్మేషన్’ వెబ్ పోర్టల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ(పీసీ మోడీ) నవంబర్ 22న ప్రారంభించారు. ఈ పోర్టల్‌తో ఆర్థిక సంస్థలకు, ఐటీ అధికారులకు, ప్రజలకు ఆటోమెటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) అంతా అందుబాటులో ఉంటుంది. ఏఈఓఐ చట్టాలు, నిబంధనలు, విధానాల వంటివి మన ఆర్థిక సంస్థలకే కాకుండా అంతర్జాతీయ ట్యాక్స్ అథారిటీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూన్స్ ఉపయుక్తంగా ఉంటాయి. సీబీడీటీ జారీ చేసే పాలసీలు, టెక్నికల్ సర్క్‌లర్లు, నోటిఫికేషన్స్ తో పాటూ దేశ, అంతర్జాతీయ నియంత్రణ సంస్థల గైడ్‌లైన్స్, లింక్స్ అన్నింటికీ ఈ పోర్టల్ స్టోరేజీ కేంద్రంగా ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌కమ్ ట్యాక్స్ ఎక్స్‌ఛేంజ్ ఇన్ఫర్మేషన్ వెబ్ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : సీబీడీటీ చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ
ఎందుకు : ప్రజలకు ఆటోమెటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) అందుబాటులో ఉంచడానికి
2019 భారత్ వృద్ధి 5.6 శాతమే!: మూడీస్
భారత్ 2019 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నవంబర్ 14న తగ్గించింది. కేవలం 5.6 శాతమే వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది. 2018లో భారత్ వృద్ధి 7.4 శాతం. వ్యవస్థలో వినియోగ డిమాండ్ పేలవంగా ఉందనీ, డిమాండ్ పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వకపోవడం తమ తాజా అంచనాలకు కారణమని మూడీస్ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తంగా భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను అక్టోబర్ 10వ తేదీన మూడీస్ 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది. భారత్ అవుట్‌లుక్‌ను కూడా గతవారం ‘స్టేబుల్’ నుంచి ‘నెగెటివ్’కు తగ్గించింది.
ఐడియా బ్యాంక్ మూసివేతకు ఆర్‌బీఐ ఆమోదం
ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మూసివేతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఐడియా బ్యాంక్ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హైకోర్టు 2019, సెప్టెంబర్ 18న ఆదేశాలు జారీ చేసిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్ నియమించిందని వివరించింది. అయ్యర్ డెలాయిట్ టచ్ తొమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీలో సీనియర్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. 2015 ఆగస్టులో ఆర్‌బీఐ మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంకింగ్ కార్యకలాపాల లెసైన్స్ లను ఇచ్చింది.
నాలుగో కంపెనీ
పేమెంట్స్ బ్యాంకింగ్ రంగం నుంచి వైదొలగిన నాలుగో కంపెనీగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. గతంలో దిలిప్ సంఘ్వి, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ల కన్సార్షియంతో పాటు టెక్ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈ రంగం నుంచి వైదొలిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మూసివేతకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 18

ఎందుకు : స్వచ్ఛంద మూసివేత కోసం ఐడియా బ్యాంక్ దరఖాస్తు చేయడంతో
బ్యాంకింగ్ మోసాలు 95 వేల కోట్లు : నిర్మలా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) రూ.95,760 కోట్లకుపైగా మోసాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 19న రాజ్యసభలో తెలిపారు. ‘ఆర్‌బీఐ సమాచారం ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి 5,743 కేసులు నమోదయ్యాయి. నిధులపరంగా చూస్తే, ఈ మోసాల విలువ 95,760.49 కోట్లు’ అని మంత్రి పేర్కొన్నారు. బ్యాంకుల్లో మోసాల నివారణకు సమగ్ర చర్యలను చేపట్టినట్లు, నిర్వహణలో లేని కంపెనీలకు సంబంధించి 3.38 లక్షల బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసినట్లు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.95,760 కోట్లకుపైగా మోసాలు
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఎఫ్‌ఎస్‌డీసీ 21వ సమావేశంలో నిర్మలా
న్యూఢిల్లీలో నవంబర్ 7న నిర్వహించిన ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్’ (ఎఫ్‌ఎస్‌డీసీ) 21వ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సమావేశానికి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్, సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి, ఐఆర్‌డీఏఐ చైర్మన్ సుభాష్‌చంద్ర కుంతియా హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌ఎస్‌డీసీ 21వ సమావేశం నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై సమీక్షించేందుకు
భారత్ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించిన మూడీస్
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్ (దృక్పథాన్ని)ను స్థిరం (స్టేబుల్) నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) తగ్గించింది. ఇదే సమయంలో విదేశీ కరెన్సీ రేటింగ్‌ను మార్చకుండా ‘బీఏఏ2 మైనస్’గానే కొనసాగించింది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) 3.7 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ఈ మేరకు నవంబర్ 8న ఒక నివేదికను విడుదల చేసింది. ఫిచ్ రేటింగ్‌స, ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్‌స మాత్రం ఇప్పటికీ భారత అవుట్‌లుక్‌ను స్థిరంగానే (స్టేబుల్)గానే కొనసాగిస్తున్నాయి.
మూడీస్ నివేదికలోని అంశాలు
నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం నవంబర్ 6న ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు ఏఐఎఫ్ సాయపడుతుందనిపేర్కొంది. ఏఐఎఫ్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
ఏమిటి : ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి

- ఆర్థిక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయింది. దీంతో సమస్యలు పెరిగాయని, ఫలితంగా వృద్ధి రేటు ఇక ముందూ తక్కువగానే ఉంటుంది.
- అవుట్‌లుక్‌ను నెగెటివ్‌కు మార్చడం పెరిగిన రిస్క్‌లను తెలియజేస్తుంది.
- ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు మందగమనం తీవ్రత, కాల వ్యవధిని తగ్గించొచ్చు.
- గ్రామీణ స్థాయిలో దీర్ఘకాలం పాటు ఆర్థిక ఒత్తిళ్లు, ఉపాధి కల్పన బలహీనంగా ఉండటం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌ఐ) రుణ సంక్షోభంతో మందగమనం మరింత స్థిరపడే అవకాశాలున్నాయి.
- ఎన్‌బీఎఫ్‌ఐల్లో రుణ సంక్షోభం వేగంగా పరిష్కారం కాకపోవచ్చు.
- ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఆర్థిక రంగానికి మద్దతునిస్తాయే గానీ, ఉత్పాదకత, వాస్తవ జీడీపీ వృద్ధి పూర్వపు స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ క్రెడిట్ రేటింగ్ తగ్గింపు
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్
మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్
ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. ఈ మేరకు బెంగళూరులో నవంబర్ 5న జరిగిన 16వ నాస్కామ్ ప్రోడక్ట్ సదస్సులో దేశీ టెక్నాలజీ స్టార్టప్ వ్యవస్థపై ఒక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్ ఉన్నారు.
నాస్కామ్ నివేదికలోని ముఖ్యాంశాలు

- 2019 ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. దీంతో గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సుమారు 8,900-9,300 స్థాయికి చేరినట్లయింది.
- 2018లో టెక్ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 7,800-8,200 దాకా ఉంది.
- 2014-2025 మధ్య కాలంలో భారత స్టార్టప్ వ్యవస్థ 10 రెట్లు వృద్ధి నమోదు చేయగలదు.
- 2025 నాటికి యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) సంఖ్య దేశీయంగా 95-105 శ్రేణిలో ఉండొచ్చు.
- సంఖ్యాపరంగా అత్యధిక టెక్నాలజీ స్టార్టప్‌లతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత స్థానంలో ఉంది.
- కొత్తగా వస్తున్న టెక్ స్టార్టప్‌ల్లో 12-15 శాతం సంస్థలు వర్ధమాన నగరాల నుంచి ఉంటున్నాయి.
- 2014లో 10-20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న స్టార్టప్ వ్యవస్థ వేల్యుయేషన్ 2025 నాటికి 350-390 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదు.
- స్టార్టప్స్‌లోకి 2018 ఏడది 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2019 ఏడాది ఇప్పటిదాకా 4.4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి.
- 2018 ఏడాది 17గా ఉన్న యూనికార్న్‌ల సంఖ్య 24కి పెరిగింది.
- 2018లో టెక్ స్టార్టప్‌లు ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1.6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాయి.
- 2019లో 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1.3-1.8 లక్షల పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగింది.
- దేశీ స్టార్టప్‌లకు మార్కెట్, నిధుల లభ్యతపరమైన సవాళ్లు ఉంటున్నాయి.
నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం నవంబర్ 6న ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు ఏఐఎఫ్ సాయపడుతుందనిపేర్కొంది. ఏఐఎఫ్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
- మొండి బకాయిలు (ఎన్‌పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఏఐఎఫ్ నిధిని పొందేందుకు అర్హమైనవి.
- రూ.25,000 కోట్ల ఏఐఎఫ్ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ అందిస్తాయి.
- నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్ రంగాల్లో డిమాండ్ పున రుద్ధరణకు ఏఐఎఫ్ తోడ్పడుతుంది.
- రెరా రిజిస్ట్రేషన్ ఉండి, సానుకూల నికర విలువ ఉన్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుంది.
ఏమిటి : ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి
Published date : 27 Nov 2019 04:33PM