Internet Explorer: ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ సేవలు నిలిపివేత.. 28 ఏళ్ల చరిత్రకు మైక్రోసాఫ్ట్ ముగింపు!
1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కే మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు ఫుల్స్టాప్ పెట్టింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్‌లపై ఫైనల్ అప్‌డేటెట్ వెర్షన్‌ను ‘ఐఈ11’ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ఫిబ్రవరి 14న ప్రకటించింది. ఈ బ్రౌజర్ ఇకపై ‘నో మోర్’ ‘రిటైర్డ్’ అని పేర్కొన్నది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు టెక్నికల్ సపోర్టును ఆపేస్తున్నట్టు వెల్లడించింది. పాత బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అప్‌డేట్ ఇస్తామని తెలిపింది. ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్‌డేట్‌ను కమర్షియల్, కన్జూమర్ డివైజ్‌లన్నింటికీ ఒకేసారి ఇస్తాం’ అని పేర్కొన్నది. ‘ఐఈ’ పూర్తిగా నిలిపివేసే ప్రక్రియను మైక్రోసాఫ్ట్ గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రకటించింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు క్రమంగా పోటీ పెరిగి, దానికంటే మంచి యూజర్ ఇంటర్ ఫేస్, ఇంటర్నెట్ స్పీడ్, స్మూత్ ఫేర్ పార్మెన్స్ తో బ్రౌజర్లు వచ్చాయి. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ఫాక్స్ నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఇదే దశలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ తీసుకొచ్చింది. దీంతో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ వాడకం తక్కువైంది. 2016 నుంచి ఈ యాప్‌కు మైక్రోసాఫ్ట్ అప్‌డేట్ ఇవ్వడం ఆపేసింది. ముఖ్యంగా ఎడ్జ్ బ్రౌజర్ తీసుకొచ్చాక దీని గురించి పట్టించుకోలేదు. కొత్త బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్‌డేట్ ద్వారా పాత బ్రౌజర్‌ను నిలిపివేసింది.
Marburg Virus: మరో కొత్త వైరస్ వ్యాప్తి.. 10 మంది మృతి.. లక్షణాలివే..!