Facebook: ఆసియాలోనే అతిపెద్ద కార్యాలయాన్ని మెటా ఎక్కడ ప్రారంభించింది?
దిగ్గజ సంస్థ మెటా (గతంలో ఫేస్‌బుక్) డిసెంబర్ 8న ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతం(గురుగ్రామ్, హరియాణ)లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆసియాలోనే అతిపెద్ద కార్యాలయంగా పరిగణిస్తున్న ఈ కేంద్రం 1.3 లక్షల చదరపు అడుగులతో ఉంది. అమెరికాలోని మెలానో పార్క్‌లో సంస్థ ప్రధాన కార్యాలయంను ఇది పోలి ఉంది. మెటా 2010లో హైదరాబాద్‌లో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. సామాజిక మాధ్యమాలు– ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లు మెటా సంస్థకు చెందినవే.
కోటి మందికి శిక్షణ..
భారత్‌లో వచ్చే మూడేళ్లలో కోటి మంది చిన్న వ్యాపారులకు, 2,50,000 మంది ఆవిష్కర్తలకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తాజాగా మెటా ప్రకటించింది.
2020–21లో భారత్ ఎకానమీ ఎంత శాతం క్షీణించింది?
భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ సంస్థ ఫిచ్ 8.7 శాతం నుంచి 8.4 శాతానికి కుదించింది. సెకండ్ వేవ్ తర్వాత ఎకానమీ రికవరీ స్పీడ్ ఊహించినంత వేగంగా లేకపోవడమే తమ తాజా అంచనాలకు కారణమని పేర్కొంది. 2022–23 ఆర్థిక ఏడాది ఎకానమీ వృద్ధి అంచనాలను మాత్రం 10 శాతం నుంచి 10.3 శాతానికి పెంచింది. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020–21లో భారత్ ఎకానమీ వృద్ధిలేకపోగా 7.3 శాతం(–7.3) క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : దిగ్గజ సంస్థ మెటా (గతంలో ఫేస్‌బుక్)
ఎక్కడ : ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతం(గురుగ్రామ్, హరియాణ)
ఎందుకు : భారత్‌లో కార్యాకలాపాల నిర్వహణ కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్