Broadband Services: జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంస్థలు?
డిజిటల్ సేవల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్) దేశీయంగా ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా లగ్జెంబర్గ్‌కు చెందిన ఎస్‌ఈఎస్ సంస్థతో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ పేరిట జాయింట్ వెంచర్ సంస్థను (జేవీ) ఏర్పాటు చేశాయి. ఇందులో జేపీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఈఎస్‌కు 49 శాతం వాటాలు ఉంటాయని ఫిబ్రవరి 14న ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఎస్‌ఈఎస్‌కి చెందిన శాటిలైట్ డేటా, కనెక్టివిటీ సర్వీసులను జాయింట్ వెంచర్ సంస్థ భారత్‌లో అందిస్తుంది.
100 జీబీపీఎస్ వేగంతో..
మారుమూల ప్రాంతాలు, వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, వినియోగదారులు మొదలైన వర్గాలన్నింటినీ కొత్త డిజిటల్ భారత్‌కు అనుసంధానించడానికి అదనంగా ఉపగ్రహ కమ్యూనికేషన్స్ సర్వీసులు తోడ్పడగలవని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. ఎస్‌ఈఎస్ భాగస్వామ్యంతో 100 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందించవచ్చని, ఈ మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జియోకి ప్రస్తుతమున్న నెట్‌వర్క్ దోహదపడగలదని చెప్పారు. వివిధ కక్ష్యల్లోని ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని జేవీ సంస్థ దేశీయంగా, ప్రాంతీయంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తుంది.
చదవండి: ఆర్‌బీఐ అక్షరాస్యతా వారోత్సవాలను ఎప్పుడు నిర్వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ పేరిట జాయింట్ వెంచర్ సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్), ఎస్‌ఈఎస్ సంస్థ
ఎందుకు : భారత్‌లో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్