UNPD: 2100 నాటికి 41 కోట్లు తగ్గిపోనున్న భారత్ జనాభా
జనాభాపరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం భారత్. చైనా తర్వాత అత్యధిక జనాభాతో కిటకిటలాడుతున్న దేశం భారత్. ప్రస్తుతం ఇక్కడ జనసంఖ్య 141.2 కోట్ల పైమాటే. మరో 78 సంవత్సరాల్లో.. అంటే 2100 నాటికి భారత్‌లో జనాభా 100.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ డివిజన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే దాదాపు 41 కోట్ల మేర జనాభా తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో రాబోయే సంవత్సరాల్లో జనాభా క్రమంగా పడిపోతుందని ఈ నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పడిపోతున్న సంతానోత్పత్తి (ఫెర్టిలిలీ) రేటు ఆధారంగా ఈ అంశాన్ని నిగ్గుతేల్చారు. ఇండియాలో ఒక్కో మహిళ ఫెర్టిలిటీ రేటు 2022లో 1.76 జననాలు కాగా, 2032 నాటికి 1.39, 2052 నాటికి 1.28, 2082 నాటికి 1.20, 2100 నాటికి 1.19 జనానాలకు పడిపోయే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలియజేసింది. చైనా జనాభా ప్రస్తుతం 145 కోట్లు కాగా, 2100 నాటికి 93.2 కోట్లకు పరిమితం అవుతుందని ఐరాస నివేదిక అంచనా వేసింది.
also read: Current Affairs Practice Test: వింబుల్డన్ 2022 పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP