5 రాష్ట్రాలకు Grant in aid రూ. రూ.4,189.58 కోట్లు విడుదల
ఏపీకి రూ.569.01 కోట్లు, కర్ణాటకకు రూ.628.07 కోట్లు, త్రిపురకు రూ.44.10 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ. 2,239.80 కోట్లు, గుజరాత్‌కు రూ.708.60 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కర్ణాటక, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లకు విడుదలైన నిధులు 2022–23 సంవత్సరానికి సంబంధించిన టైడ్ గ్రాంట్లలో 1వ విడత కాగా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లకు విడుదలైనవి 2021–22 సంవత్సరపు టైడ్ గ్రాంట్ల 2వ విడత అని వివరించింది.
Also read: World Bank Report : రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల.. టాప్-1లో..
పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత నిర్వహణ, తాగునీటి సరఫరా, వర్షపునీటి సేకరణ, నీటి రీసైక్లింగ్ అనే కీలకమైన సేవలను మెరుగుపరిచేందుకు తాగునీరు, పారిశుద్ధ్య శాఖల సూచనలతో గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు టైడ్ గ్రాంట్లు విడుదలయ్యాయని పేర్కొంది. పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించిన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో 60 శాతం జాతీయ ప్రాధా న్యతలైన తాగునీటి సరఫరా, వర్షపునీటి సంరక్షణ, పారిశుద్ధ్యం కోసం కేటాయించారని, 40 శాతం అన్ టైడ్ నిధులు స్థానిక నిర్దిష్ట అవసరాల కోసం పంచాయతీరాజ్ సంస్థల విచక్షణ ప్రకారం వినియోగిస్తారని వివరించింది. 2022–23లో ఇప్పటివరకు గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.15,705.65 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది.
Also read: Britain GDP: 300 ఏళ్లలోనే అత్యంత కనిష్టానికి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP