Air India CEO & MD: ఎయిరిండియా సీఈవోగా నియమితులైన వ్యక్తి?
విమానయాన సంస్థ ఎయిరిండియా సీఈవో, ఎండీగా టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ ఎల్కర్ ఐజు నియమితులయ్యారు. ఎయిరిండియా బోర్డ్ సోమవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఫిబ్రవరి 14న టాటా సన్స్ ప్రకటించింది. 2022, ఏప్రిల్ 1 లేదా ముందస్తుగా ఎల్కర్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది.
గ్లాన్స్‌లో జియో రూ. 1,500 కోట్ల పెట్టుబడులు
మొబైల్ లాక్ స్క్రీన్ కంటెంట్ అందించే గ్లాన్స్ ప్లాట్‌ఫామ్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ 17 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,500 కోట్లు) వెచ్చించనుంది. ఆసియా మార్కెట్లో ఎదుగుదలతో పాటు అమెరికా, బ్రెజిల్, మెక్సికో, రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా విస్తరించేందుకు గ్లాన్స్ ఈ నిధులను ఉపయోగించుకోనుంది.
షిప్‌రాకెట్ చేతికి గ్లాకస్ సప్లై చైన్
వ్యాపార సంస్థలకు పంపిణీ, సేల్స్ రిటర్న్‌ల నిర్వహణ మొదలైన సర్వీసులను అందిస్తోన్న ‘‘గ్లాకస్ సప్లై చెయిన్ సొల్యూషన్స్’’లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినట్లు ఈ–కామర్స్ షిప్పింగ్ ప్లాట్‌ఫాం సంస్థ షిప్‌రాకెట్ వెల్లడించింది. ట్రేడర్లు, రిటైలర్లు, బ్రాండ్లు .. ఉత్పత్తుల నిల్వ, ప్యాకేజింగ్ వంటి అంశాలపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు రెండు సంస్థల భాగస్వామ్యం ఉపయోగపడగలదని తెలిపింది. గ్లాకస్‌ను 2015లో వివేక్ కల్రా, నితిన్ ధింగ్రా, మన్‌దీప్ కన్వల్, జయంత్ మహతో కలిసి ప్రారంభించారు.
చదవండి: జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంస్థలు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్