Skip to main content

Billdesk-PayU Deal: బిల్‌డెస్క్‌ను సొంతం చేసుకోనున్న ఫిన్‌టెక్‌ సంస్థ?

దేశీ ఇంటర్నెట్‌ కన్జూమర్‌ విభాగంలో తాజాగా అతిపెద్ద ఒప్పందానికి తెరలేచింది.
Billdesk-PayU deal
PayU-Billdesk

 ఫిన్‌టెక్‌ బిజినెస్‌ సంస్థ పేయూ.. డిజిటల్‌ పేమెంట్స్‌ సర్వీసుల సంస్థ బిల్‌డెస్క్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 4.7 బిలియన్‌ డాలర్లు(రూ. 34,376 కోట్లు) వెచ్చించనుంది. దీంతో పేయూ మాతృ సంస్థ, నెదర్లాండ్స్‌ దిగ్గజం ప్రోసస్‌ ఎన్‌వీ... దేశీ పెట్టుబడులు 10 బిలియన్‌ డాలర్ల(రూ. 73,140 కోట్లు)కు చేరనున్నాయి. అయితే బిల్‌డెస్క్, పేయూ డీల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) అనుమతి లభించవలసి ఉంది. 2022 తొలి త్రైమాసికానికల్లా ఒప్పందం పూర్తయ్యే వీలుంది. బిల్‌డెస్క్‌ కార్యకలాపాలు 2000లో ప్రారంభమయ్యాయి.

అర్థ్‌నీతి–వాల్యూమ్‌...
అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు, దేశ ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ నీతి ఆయోగ్‌ ‘అర్థ్‌నీతి–వాల్యూమ్‌’ 7ను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని ప్రస్తావిస్తూ... ‘జీఎస్‌డీపీ పరంగా తెలంగాణ ఏడో పెద్ద రాష్ట్రం. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది’ అని పేర్కొంది.

జాతీయ పార్టీలపై ఏడీఆర్‌ నివేదిక
దేశంలోని జాతీయ పార్టీలన్నీ కలిసి 2019–20 కాలంలో రూ. 3,377.41కోట్లను గుర్తుతెలియని వనరుల(అన్‌నౌన్‌ సోర్సెస్‌) నుంచి సమీకరించాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. పార్టీల మొత్తం ఆర్జనలో ఈ అజ్ఞాత విరాళాల ద్వారా ఆర్జించిన మొత్తం  70.98 శాతానికి అంటే ముప్పావు వంతుకు సమానమని తెలిపింది. ఈ నిధుల్లో సింహభాగం అంటే రూ. 2,642. 63కోట్లు బీజేపీ సమీకరించగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌(రూ.526కోట్లు), ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, బీఎస్‌పీ ఉన్నాయని తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బిల్‌డెస్క్‌ను సొంతం చేసుకోనున్న ఫిన్‌టెక్‌ సంస్థ?
ఎప్పుడు  : ఆగస్టు 31
ఎవరు    : ఫిన్‌టెక్‌ బిజినెస్‌ సంస్థ పేయూ 
ఎందుకు : బిల్‌డెస్క్, పేయూ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు...
 

Published date : 23 Sep 2021 01:06PM

Photo Stories