MeitY-AISPL: కేంద్ర ఐటీ శాఖతో ఒప్పందం చేసుకున్న సంస్థ?
దేశీయంగా సాంకేతిక ఆవిష్కరణలకు, స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) స్టార్టప్ హబ్‌తో అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ (ఏఐఎస్‌పీఎల్) జట్టు కట్టింది. అధునాతన టెక్నాలజీ సామర్థ్యాలు ఉన్న స్టార్టప్‌లను గుర్తించి, సమాజానికి ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంలో వాటికి సహాయపడేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. దీని కింద స్టార్టప్‌లకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) సేవలు, నిపుణుల సలహాలు, సాంకేతిక శిక్షణ మొదలైనవి లభిస్తాయి. ప్రస్తుతం మెయిటీ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు.
వరల్డ్ ఐజీబీసీ ఏపీఎన్‌కు వైస్ చైర్మన్‌గా ఆనంద్
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)కు చెందిన ఎం. ఆనంద్... వరల్డ్ ఐజీబీసీ ఏసియా పసిఫిక్ రీజినల్ నెట్‌వర్క్ (ఏపీఎన్) కు వైస్ చైర్మన్‌కు నియమితులయ్యారు. కాలుష్యరహిత, పర్యావరణానుకూల భవన నిర్మాణాలను ప్రోత్సహించడంలో వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తోంది.
బిగ్–సి అంబాసిడర్‌గా మహేశ్...
మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని బిగ్–సి సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు.
చదవండి: ప్రధాని మోదీ భేటీ అయిన క్వాల్‌కామ్ సీఈవో పేరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) స్టార్టప్ హబ్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ (ఏఐఎస్‌పీఎల్)
ఎందుకు : అధునాతన టెక్నాలజీ సామర్థ్యాలు ఉన్న స్టార్టప్‌లను గుర్తించి, సమాజానికి ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంలో వాటికి సహాయపడేందుకు...