Asian Development Bank: ఏడీబీ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్ వృద్ధి రేటు?
2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదవుతుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 10 శాతం నుంచి 9.7 శాతానికి కుదించింది. తొలుత 11 శాతం వృద్ధి అంచనాలను సెప్టెంబర్‌లో 10 శాతానికి తగ్గించిన ఏడీబీ... తాజాగా మరో 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కుదించింది. పరిశ్రమలకు సంబంధించి సరఫరా సమస్యలు ఇందుకు ప్రధాన కారణమని తాజాగా విడుదల చేసిన నివేదికలో ఏడీబీ పేర్కొంది. దక్షిణాసియా వృద్ధి రేటును కూడా 8.8 శాతం నుంచి 8.6 శాతానికి సంస్థ తగ్గించింది.
కినారా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన క్రికెటర్?
కినారా క్యాపిటల్ ప్రముఖ ఆల్‌రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈలకు ఫిన్‌టెక్ సేవలను కినారా క్యాపిటల్ ఆఫర్ చేస్తుంటుంది.
చదవండి: సీఆర్‌ఏ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటు ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలు 10 శాతం నుంచి 9.7 శాతానికి కుదింపు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
ఎందుకు : పరిశ్రమలకు సంబంధించిన సరఫరా సమస్యల కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్