యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్ కుమార్ జోషి
Sakshi Education
యూపీఎస్సీ నూతన కొత్త చైర్మన్ గా విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషి ఆగస్టు 7న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు
. ఇప్పటి వరకూ పదవీ బాధ్యతలు నిర్వహించిన అరవింద్ సక్సేనా ప్రదీప్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కమిషన్‌లో సభ్యుడిగా చేరక ముందు ఆయన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు చైర్మన్‌గా పనిచేశారు. 2015 మే 12న ఆయన కమిషన్‌లో చేరారు. ఆర్థిక నిర్వహణ విభాగంలో నిపుణత కలిగిన జోషి 2021 మే 12వరకూ చైర్మన్‌గా ఉంటారు. జోషి చైర్మన్‌గా ఎంపికతో, కమిషన్‌లో ఓ సభ్యుడి స్థానం ఖాళీ అయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూపీఎస్సీ నూతన కొత్త చైర్మన్ గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషి
Published date : 08 Aug 2020 08:21PM