యూనికార్న్ జాబితాలో చేరిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ?
Sakshi Education
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అప్‌గ్రేడ్ మూడోసారి వెలుపలి సంస్థ నుంచి నిధులను సమీకరించింది.
ఐఐఎఫ్‌ఎల్ గ్రూప్ నుంచి తాజాగా 2.5 కోట్ల డాలర్లు(రూ. 186 కోట్లు) సమీకరించింది. దీంతో కంపెనీ విలువ 1.2 బిలియన్ డాలర్లకు(రూ. 8,912 కోట్లు) చేరింది. స్టార్టప్‌ల రంగంలో 100 కోట్ల డాలర్ల విలువ(1 బిలియన్ డాలర్లు)ను చేరిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేలండర్ ఏడాది(2021)లో ఆగస్ట్ 2 వరకూ 17 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా ఆవిర్భవించాయి.
జాబితా ఇలా...
2021 ఏడాది యూనికార్న్ జాబితాలో చేరిన సంస్థలలో షేర్‌చాట్, గ్రో, గప్‌షుప్, మీషో, ఫార్మ్‌ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, ఆఫ్‌బిజినెస్, క్రెడ్, మాగ్లిక్స్, జెటా, బ్రౌజర్‌స్టాక్ తదిరాలు చేరాయి. క్రెడిట్ స్వీస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా 100కు మించిన స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను పొందాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూనికార్న్ జాబితాలో చేరిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అప్‌గ్రేడ్
ఎక్కడ : భారత్
ఎందుకు : కంపెనీ విలువ 100 కోట్ల డాలర్లు(1 బిలియన్ డాలర్లు)ను దాటడంతో...

Published date : 11 Aug 2021 06:13PM