యునెస్కోలో ప్రధాని మోదీ ప్రసంగం
Sakshi Education
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 23న నిర్వహించిన కార్యక్రమంలో భారత సంతతికి ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
అంతకుముందు ఫ్రాన్సులో 1950, 1960ల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల స్మారక చిహ్నాన్ని మోదీ ప్రారంభించారు.
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయటంతో పాటు దాన్ని శిక్షార్హమైన నేరంగా చేస్తూ చట్టం తీసుకువచ్చింది.
- ముందెన్నడూ లేని రీతిలో దేశంలో అవినీతికి, బంధుప్రీతికి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేశాం.
- జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశంలో అతి పెద్ద సమస్యగా మారిన కేవలం ఒకే ఒక్క తాత్కాలిక వ్యవహారాన్ని డీల్ చేయటానికి 70 ఏళ్లు పట్టిన విషయం మీరే చూశారు.
- ఇన్‌ఫ్రా అనే పదాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ ఇన్‌ఫ్రా ఇన్ అంటే ఇండియా. ఫ్రా అంటే ఫ్రాన్స్. ఇన్‌ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలూ దృఢంగా ఉండాలన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 24 Aug 2019 05:30PM