Skip to main content

యూకేలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన భారత సంస్థ?

భారత్‌కి చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) యూకేలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది.
Current Affairsఈ విషయాన్ని డిసెంబర్ 7న టీసీఎస్ తెలిపింది. యూకే డిజిటల్ ఎకానమీలో టీసీఎస్ ప్రభావ వంతమైన బ్రాండ్‌గా ఎదిగింది. వరుసగా 6 సార్లు ఐటీ సేవల్లో 3 ప్రధాన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.

కాఫీ డే సీఈవోగా మాళవిక...
కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్‌ప్రెసైస్ సీఈవోగా మాళవిక హెగ్డే నియమితులయ్యారు. అయిదేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు కంపెనీలో డెరైక్టర్‌గా ఉన్నారు. ఆమె సంస్థ వ్యవస్థాపకులు, దివంగత వి.జి.సిద్ధార్థ సతీమణి.

బయోఫ్యూయెల్ అభివృద్ధికి భారత్‌కు సాయం అందించిన సంస్థ?
అత్యాధునిక బయోఫ్యూయెల్ అభివృద్ధికిగాను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) భారత్‌కు 2.5 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.18 కోట్లు) సాంకేతిక సహాయంగా మంజూరు చేసింది.
Published date : 08 Dec 2020 05:28PM

Photo Stories