యూఎస్ ఓపెన్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్?
Sakshi Education
యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ప్లేయర్‌గా (పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలు కలిపి) అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఘనత వహించింది.
న్యూయార్క్‌లో సెప్టెంబర్ 2న జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సెరెనా 7-5, 6-3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్‌పై విజయం సాధించడంతో తాజా రికార్డు నమోదైంది. తాజా గెలుపుతో 101 విజయాలతో అమెరికాకే చెందిన మరో దిగ్గజం క్రిస్ ఎవర్ట్ పేరిట ఇన్నాళ్లూ ఉన్న రికార్డును 102వ విజయంతో సెరెనా బద్దలు కొట్టింది. 1998లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఆడిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014)... నాలుగుసార్లు రన్నరప్‌గా (2001, 2011, 2018, 2019) నిలిచింది.
చదవండి: టెస్టుల్లో 600 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్
500 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ ఓపెన్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : సెరెనా విలియమ్స్
Published date : 03 Sep 2020 05:01PM