యూఎస్ లగ్జరీ మోటర్ సైకిల్ బ్రాండ్ హార్లీ డేవిడ్సన్ ఏ భారతీయ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
Sakshi Education
ఇటీవల భారత మార్కెట్ నుంచి వైదొలిగిన యూఎస్ లగ్జరీ మోటర్ సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్సన్ అక్టోబర్ 27న దేశీయ ద్విచక్ర తయారీదారి సంస్థ హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : యూఎస్ లగ్జరీ మోటర్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్సన్
ఎందుకు :హీరో మోటోకార్ప్ హ్యార్లీ డేవిడ్సన్ బ్రాండ్ పేరుతో ప్రీమియం బైకులను తయారీ చేయడంతో పాటు విక్రయాలను జరిపేందుకు
ఈ ఒప్పందం ప్రకారం హీరో మోటోకార్ప్ హ్యార్లీ డేవిడ్సన్ బ్రాండ్ పేరుతో ప్రీమియం బైకులను తయారీ చేయడంతో పాటు విక్రయాలను జరపాల్సి ఉంటుంది.హ్యార్లీ బైకులకు సర్వీసులను అందించడంతో పాటు విడిభాగాల అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. అలాగే హ్యార్లీ బ్రాండ్ పేరుతో ప్రత్యేకంగా తయారయ్యే ఉపకరణాలు, వస్తువులు, రైడింగ్ గేర్, దుస్తులను దేశవ్యాప్తంగా హీరో మోటోకార్ప్ తన నెట్‌వర్క్ ద్వారా అమ్మనుంది. ఈ డీల్‌తో భారత మార్కెట్‌లో తమ బ్రాండ్ సుస్థిరంగా కొనసాగుతుందని హ్యార్లీడేవిడ్సన్ తెలిపింది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : యూఎస్ లగ్జరీ మోటర్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్సన్
ఎందుకు :హీరో మోటోకార్ప్ హ్యార్లీ డేవిడ్సన్ బ్రాండ్ పేరుతో ప్రీమియం బైకులను తయారీ చేయడంతో పాటు విక్రయాలను జరిపేందుకు
Published date : 28 Oct 2020 05:31PM