Skip to main content

యూఎన్‌ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో భారత్ ర్యాంకు?

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సూచీ-2021లో భారత్ 117వ ర్యాంకును పొందింది. ఐరాస జూన్ 6న విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
Current Affairs 2020 ఏడాది 115వ ర్యాంకుని సాధించిన భారత్‌ ఈ ఏడాది 117తో సరిపెట్టుకుంది. దక్షిణాసియా దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే భారత్‌ వెనుకబడి ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మొత్తమ్మీద చూసుకుంటే భారత్‌కి ఎస్‌డీజీ స్కోర్‌ 100కి 61.9 వచ్చింది. ఆకలి కేకల నిర్మూలన, ఆహార భద్రత , లింగ సమానత్వం, మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయింది.193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి 2030 నాటికి సుస్థిరాభివృద్ధి సాధించాలని 2015 సంవత్సరంలో 17 లక్ష్యాలను నిర్దేశించుకుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎన్‌సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సూచీ-2021లో117వ ర్యాంకు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : భారత్
ఎందుకు : సుస్థిరాభివృద్ధికి సంబంధించి భారత్‌ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో...
Published date : 07 Jun 2021 07:22PM

Photo Stories