యస్ బ్యాంకు షేర్ల కొనుగోలుకు ఎస్‌బీఐ ఆమోదం
Sakshi Education
సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు (ఈసీసీబీ) నుంచి అనుమతి వచ్చినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మార్చి 12న వెల్లడించింది.
ఈ ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐ 725 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున మొత్తం రూ. 7,250 కోట్లు చెల్లించనుంది. యస్ బ్యాంక్ పెయిడప్ క్యాపిటల్‌లో 49 శాతం లోపే ఎస్‌బీఐ వాటా ఉండనుంది.
మొండిబాకీలు, గవర్నెన్స్ లోపాలు, నిధుల కొరతతో సతమతమవుతున్న యస్ బ్యాంకుపై 2020, ఏప్రిల్ 3 దాకా ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యస్ బ్యాంకులో 725 కోట్ల షేర్లను కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : ఎస్‌బీఐ ఈసీసీబీ

Published date : 13 Mar 2020 05:40PM