యస్ బ్యాంక్ తాత్కాలిక సీఈఓగా అజయ్ కుమార్
Sakshi Education
ప్రైవేటు రంగ సంస్థ యస్ బ్యాంక్ తాత్కాలిక సీఈఓగా అజయ్ కుమార్ నియమితులయ్యారు.
ప్రస్తుతం యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్‌గా పనిచే స్తున్న అజయ్ ఫిబ్రవరి 1 నుంచి దాదాపు నెలరోజులపాటు సీఈఓ పదవిలో కొనసాగుతారని జనవరి 31న యస్ బ్యాంక్ ప్రకటించింది. జనవరి 31తో యస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా రాణా కపూర్ పదవీకాలం ముగియడం.. మార్చి ఒకటి నుంచి రవ్‌నీత్ సింగ్ గిల్ ఈ స్థానంలోకి రానున్న నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డాషే బ్యాంక్ ఇండియా అధిపతిగా రవ్‌నీత్ గిల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యస్ బ్యాంక్ తాత్కాలిక సీఈఓ నియామకం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : అజయ్ కుమార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : యస్ బ్యాంక్ తాత్కాలిక సీఈఓ నియామకం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : అజయ్ కుమార్
Published date : 01 Feb 2019 05:06PM