Skip to main content

యస్ బ్యాంక్ సీఈవో, ఎండీగా ప్రశాంత్ కుమార్

2020, మార్చి 13 నుంచి ‘యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020’ని అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Current Affairs ఈ నోటిఫికేషన్ ప్రకారం... సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌పై మార్చి 18న మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత బ్యాంక్ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మారటోరియం తొలగిన 7 రోజుల తర్వాత ప్రశాంత్ సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటుకానుంది.

నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సునీల్..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... యస్ బ్యాంక్ కొత్త బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లుగా ఉండనున్నారు.

2020, ఏప్రిల్ 3 దాకా విత్‌డ్రాయల్స్‌ను రూ. 50,000కు పరిమితం చేస్తూ మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యస్ బ్యాంక్ సీఈవో, ఎండీగా నియామకం
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : ప్రశాంత్ కుమార్
Published date : 16 Mar 2020 06:28PM

Photo Stories