వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా టైన్ 18
Sakshi Education
దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’కు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ జనవరి 27న తెలిపారు. వారణాసి-ఢిల్లీ మధ్య ఈ రైలును నడపనున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
16 బోగీలున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూ.97 కోట్ల వ్యయంతో నిర్మించింది. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత ఇంజనీర్లు 18 నెలల్లోనే పూర్తి ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైలును అభివృద్ధి చేశారు. లోకోమోటివ్‌ల అవసరం లేకుండా నడిచే తొలి రైలుగా ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రికార్డు నెలకొల్పింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా ట్రైన్ 18 నామకరణం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా ట్రైన్ 18 నామకరణం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్
Published date : 28 Jan 2019 06:28PM