వివాద్ సే విశ్వాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Sakshi Education
ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ బిల్లు 2020’కు మార్చి 4న లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
ఈ బిల్లు ప్రకారం... 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు, రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్‌టీ) ఉన్న పెండింగ్ కేసులు వివాద్ సే విశ్వాస్ పథకం పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది.
పథకాన్ని ఎంచుకున్న వారు.. 2020, మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2020-21 బడ్జెట్‌లో వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వివాద్ సే విశ్వాస్ బిల్లు 2020కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి

Published date : 05 Mar 2020 06:01PM