Skip to main content

విశ్వాస పరీక్షలో గహ్లోత్‌ ప్రభుత్వం గెలుపు

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఆగస్టు 14న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది.
Current Affairs
సచిన్ పైలట్‌ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరడంతో బల నిరూపణ సునాయాసమైంది. దాంతో దాదాపు నెల రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ సంక్షోభం ముగిసింది. శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, సభ ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది.

200 మంది సభ్యుల రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 107గా ఉంది. మిత్రపక్షాలు బీటీపీ(2), సీపీఎం(2), ఆరెల్డీ(1), స్వతంత్రులు(13)తో కలిసి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య 125 వరకు ఉంటుంది. బీజేపీ సభ్యుల సంఖ్య 72. మిత్రపక్షం(ఆర్‌ఎల్పీ 3)తో కలుపుకుని బీజేపీకి 75 మంది సభ్యుల మద్దతుంది.

చదవండి: 2018 రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు-ఫలితాలు

క్విక్ రివ్యూ :
ఏమిటి : విశ్వాస పరీక్షలో గహ్లోత్‌ ప్రభుత్వం గెలుపు
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం
Published date : 15 Aug 2020 05:34PM

Photo Stories