విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న సంస్థ?
Sakshi Education
విశాఖపట్నంలో డేటా సెంటర్, బిజినెస్ పార్క్ నెలకొల్పేందుకు వైజాగ్ టెక్ పార్క్ (వీటీపీఎల్) పేరిట అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది.
దీని అధీకృత మూలధనం రూ. 5 లక్షలుగా ఉంటుందని పేర్కొంది. విశాఖలో సమీకృత డేటా సెంటర్ పార్క్‌తో పాటు టెక్నాలజీ/బిజినెస్ పార్క్ అభివృద్ధి చేసే లక్ష్యంతో వీటీపీఎల్ ఏర్పాటైందని అదానీ తెలిపింది.
తెలంగాణలో ఓ రహదారి ప్రాజెక్టు అభివృద్ధి, నిర్వహణ పనుల కోసం కోదాడ ఖమ్మం రోడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు అదానీ సంస్థ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైజాగ్ టెక్ పార్క్ (వీటీపీఎల్) పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : అదానీ ఎంటర్‌ప్రైజెస్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : విశాఖపట్నంలో డేటా సెంటర్, బిజినెస్ పార్క్ నెలకొల్పేందుకు

Published date : 02 Apr 2021 06:40PM