Skip to main content

విశాఖలో ప్రపంచ సముద్ర సైన్స్ కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 25 నుంచి ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు (ఓషన్ సైన్స్ కాంగ్రెస్)ను నిర్వహించనున్నారు.
మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 1,500 మంది సముద్ర అధ్యయన/విజ్ఞాన శాస్త్రవేత్తలు, రక్షణరంగ నిపుణులు, జియో సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు, మెట్రాలజిస్టులతో పాటు రీసెర్చి స్కాలర్లు, విద్యార్థులు పాల్గొననున్నారు. సముద్రంలో వాతావరణ మార్పులు, సముద్రం-సమాజం, మారిటైం లా, జియోపాలిటిక్స్, మారిటైం హిస్టరీ, ఆర్కియాలజీ, కోస్టల్ టూరిజం, షిప్పింగ్, ఫిషరీ, ఆక్వాకల్చర్ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు (ఓషన్ సైన్స్ కాంగ్రెస్)
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 14 Feb 2019 05:34PM

Photo Stories