Skip to main content

విమానాశ్రయాల చట్ట సవరణల బిల్లుకు ఆమోదం

ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లుకు ఆగస్టు 4న పార్లమెంటు ఆమోదం లభించింది.
మారుమూల ప్రాంతాల్లోనూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చిన్న విమానాశ్రయాల కార్యకలాపాల విస్తరణను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు. కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు ఉద్దేశించిన ‘సెంట్రల్‌ యూనివర్సిటీస్‌(అమెండ్‌మెంట్‌) బిల్లు–2021’కు ఆగస్టు 6న లోక్‌సభ ఆమోదం తెలిపింది. మరోవైపు ‘ట్యాక్సేషన్‌ చట్టాలు(సవరణ) బిల్లు–2021’ను లోక్‌సభ ఆమోదించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : భారత పార్లమెంటు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : మారుమూల ప్రాంతాల్లోనూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చిన్న విమానాశ్రయాల కార్యకలాపాల విస్తరణను ప్రోత్సహించే ఉద్దేశంతో...
Published date : 07 Aug 2021 05:42PM

Photo Stories