Skip to main content

విజయవాడలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్థంతిని పురస్కరించుకుని విజయవాడలోని కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ పార్కులో సెప్టెంబర్ 2న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు.. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్ జగన్.. ఆయన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. కడప జిల్లాలోని పులివెందుల చేరుకుని మాజీమంత్రి, చిన్నాన్న దివంగత వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 05 Sep 2019 05:54PM

Photo Stories