Skip to main content

వెనిజులాలోని కెనడా ఎంబసీ మూసివేత

వెనిజులా రాజధాని కారకస్‌లోని తమ దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు కెనడా ప్రకటించింది.
వెనిజులాతో తలెత్తిన విభేదాల కారణంగా తామీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, వెనిజులా ప్రతిపక్ష నేత గైడో తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. మదురోను గద్దె దింపేందుకు కుట్ర పన్ని సైనిక తిరుగుబాటుకు విఫలయత్నం చేశాడు. అయితే, దేశ ప్రజలతో పాటు సైన్యం కూడా మదురోకే మద్దతుగా నిలిచింది. గైడో చర్యలను అమెరికా సహా 50దేశాలు మద్దతిస్తున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కెనడా ఎంబసీ మూసివేత
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : కెనడా ప్రభుత్వం
ఎక్కడ : కారకస్, వెనిజులా
Published date : 04 Jun 2019 05:46PM

Photo Stories