వెనిజులాలో చమురుశుద్ధి కర్మాగారం ప్రారంభం
Sakshi Education
వెనిజులా రాజధాని కారకాస్‌లో చైనా సహకారంతో నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారాన్ని వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆగస్టు 8న ప్రారంభించారు.
వెనిజులాలో చమురు ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ సహకారంతో నిర్మించిన ఈ రిఫైనరీని సైనో వెన్సా సంస్థ నిర్వహిస్తుంది. ఈ రిఫైనరీ ద్వారా చమురు ఉత్పత్తిని రోజుకు ప్రస్తుతం వున్న 1.1 లక్షల బ్యారెళ్ల స్థాయి నుండి 1.65 లక్షల బ్యారెళ్ల స్థాయికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. చైనా-వెనిజులా సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు, పరస్పర గౌరవం, నిరంతర చర్చల ప్రాతిపదికన తాము ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మదురో చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనా సహకారంతో నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో
ఎక్కడ : వెనిజులా
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనా సహకారంతో నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో
ఎక్కడ : వెనిజులా
Published date : 10 Aug 2019 07:43PM