Skip to main content

వెల్స్ టోర్ని విజేతలుగా థీమ్, బియాంక

ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రియాకి చెందిన డొమినిక్ థీమ్, కెనడాకి చెందిన బియాంక ఆండ్రీస్కు విజేతలుగా నిలిచారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 18న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డొమినిక్ థీమ్ 3-6, 6-3, 7-5తో నాలుగో సీడ్, గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. అలాగే మహిళల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బియాంక 6-4, 3-6, 6-4తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నమెంట్ విజేతలు
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : డొమినిక్ థీమ్, బియాంక ఆండ్రీస్కు
ఎక్కడ : కాలిఫోర్నియా, అమెరికా
Published date : 19 Mar 2019 05:03PM

Photo Stories