వేదాంత స్టెరిలైట్ రాగి ప్లాంట్ ఏ ప్రాంతంలో ఉంది
Sakshi Education
తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడిలో ఉన్న వేదాంత లిమిటెడ్‌కు చెందిన ‘స్టెరిలైట్’ రాగి ప్లాంట్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు అనుమతి లభించింది.
ఆక్సిజన్ ఉత్పత్తికి మాత్రమే పరిమితమై నాలుగునెలల గడువుతోఏప్రిల్ 26న ప్రభుత్వం అంగీకరించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత నెలకొని ఉండగా... పునః ప్రారంభానికి అవకాశం ఇస్తే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఉచితంగా అందజేస్తామని స్టెరిలైట్ కంపెనీ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం విదితమే. సుప్రీం సూచనలకు అణుగుణంగా తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
2018లోమూసివేత...
స్టెరిలైట్ రాగి ప్లాంటును 1996లో నాలుగు లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో తూత్తుకుడిలో స్థాపించారు.ఈ కంపెనీ వల్ల భూగర్భ జలాలు తగ్గడం, పర్యావరణ కాలుష్యం జరగడంతోపాటు కేన్సర్ వంటి రోగాలు ప్రబలుతుండటంతో ప్లాంట్‌ను మూసివేయాలని 2017–18లో తీవ్ర ఆందోళనలు, నిరసన ప్రదర్శలు జరిగాయి.ఈ సందర్బంగా జరిగిన కాల్పుల్లో ఉద్యమకారులు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామంతో స్టెరిలైట్ కంపెనీకి 2018లో రాష్ట్ర ప్రభుత్వం సీలువేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :వేదాంత స్టెరిలైట్రాగి ప్లాంట్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు అనుమతి
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
ఎక్కడ : తూత్తుకూడి, తమిళనాడు
ఎందుకు:కరోనా కారణంగా దేశంలో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయిన నేపథ్యంలో...

Published date : 27 Apr 2021 05:57PM