Skip to main content

వైఎస్సార్‌ నిర్మాణ్, కోవిడ్‌–19 రెస్పాన్స్‌ పోర్టల్స్‌ ప్రారంభం

సిమెంట్‌ తయారీ కంపెనీలు, వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసే ల‌క్ష్యంతో రూపొందించిన వైఎస్సార్‌ నిర్మాణ్‌ పోర్టల్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 8న ఆవిష్కరించారు.
Current Affairs
అలాగే వైద్య సంబంధిత ఉత్పత్తులను అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేందుకు రూపొందించిన ఏపీ ఇండస్ట్రీస్‌ కోవిడ్‌–19 రెస్పాన్స్‌ పోర్టల్ ను కూడా సీఎం ఆవిష్కరించారు.

వైఎస్సార్‌ నిర్మాణ్‌..

పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు, పేదల గృహ నిర్మాణం, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఏ పరిమాణంలో సిమెంటు కావాలో వైఎస్సార్‌ నిర్మాణ్‌ పోర్టల్, యాప్‌ ద్వారా ఇండెంట్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పోర్టల్‌ను సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)కు అనుసంధానం చేశారు.

కోవిడ్‌–19
రెస్పాన్స్‌ పోర్టల్..
  • రాష్ట్రంలో ఉన్న మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలు, సరఫరాదారులు ఏపీ ఇండస్ట్రీస్‌ కోవిడ్‌–19 రెస్పాన్స్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
  • కోవిడ్‌–19 మెడికల్‌ రిలేటెడ్‌ ఐటెంలు, మాస్క్‌లు, శానిటైజర్స్, బెడ్స్, బెడ్‌ రోల్స్‌ వంటి వైద్య పరమైన సామగ్రి అమ్మేవారు, కొనేవాళ్లు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
  • దీని వల్ల ఎవరి దగ్గరి ఎలాంటి వైద్య పరమైన, ఇతర సంబంధిత ఉత్పత్తులున్నాయన్న వివరాలతోపాటు అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి వచ్చే వెసులుబాటు ఉంటుంది.
  • దీనిని డెస్క్‌టాప్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా అందరూ వాడుకోవచ్చు. అవసరమైన సామగ్రి కొనుగోలు చేయుటకు సౌలభ్యంగా ఉంటుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వైఎస్సార్‌ నిర్మాణ్, కోవిడ్‌–19 రెస్పాన్స్‌ పోర్టల్స్‌ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సిమెంట్‌ తయారీ కంపెనీలు, వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసే ల‌క్ష్యంతో, వైద్య సంబంధిత ఉత్పత్తులను అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేందుకు
Published date : 09 Apr 2020 05:04PM

Photo Stories