వైఎస్సార్ మత్య్సకార భరోసాకు కేబినెట్ ఆమోదం
Sakshi Education
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ మత్య్సకార భరోసా’ పథకానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నవంబర్ 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మత్య్సకార భరోసా పథకం వైఎస్సార్ బీమా పథకం కింద నమోదు చేసుకున్న 18-60 సంవత్సరాల మధ్య వయసున్న వారికి వర్తిస్తుంది. 2019, నవంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
మంత్రిమండలి భేటీలోని మరికొన్ని నిర్ణయాలు
2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం. 12వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ తెలుగు లేదా ఉర్దూను రెండో సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలి.
మంత్రిమండలి భేటీలోని మరికొన్ని నిర్ణయాలు
2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం. 12వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ తెలుగు లేదా ఉర్దూను రెండో సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలి.
- రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల పరిధిలో అక్రమంగా వేసిన లే అవుట్లలో ప్లాట్ కొని, ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా.. రవాణా చేసినా.. బ్లాక్‌మార్కెట్‌లో అమ్మినా.. ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రూ. 2 లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టానికి సవరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
- పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాలతో నదీ, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం.
- మొక్కజొన్న క్వింటాల్ ధర రూ. 2,200 నుంచి రూ.1,500కి పడిపోయిన నేపథ్యంలో వెంటనే విజయనగరం, కర్నూలులో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం.
- ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ పాలసీ-2018, ఆంధ్రప్రదేశ్ విండ్ పవర్ పాలసీ-2018, ఆంధ్రప్రదేశ్ విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ పాలసీ-2018 పాలసీల సవరణలకు ఆమోదం.
- రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం -2008 సవరణకు అంగీకారం.
- ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణ, మున్సిపల్ లా చట్టంలో సవరణలకు గ్రీన్‌సిగ్నల్.
- రూ. 20 కోట్లకు పైగా ఆదాయముండే 8 ప్రముఖ ఆలయాలకు కొత్తగా ట్రస్టు బోర్డుల నియామకానికి మంత్రిమండలి పచ్చజెండా.
Published date : 14 Nov 2019 05:34PM