Skip to main content

వైఎస్సార్‌ ఆసరాకు మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లించనుంది.
Current Affairs
ఇందుకోసం ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ఆగస్టు 19న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మొదటి విడతగా 2020–21కి గాను రూ.6,792.21 కోట్లు చెల్లించనుంది. తద్వారా రాష్ట్రంలోని 9,33,180 డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలగనుంది.

త్వరలో జగనన్న విద్యా కానుక...
రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక పథకాన్ని 2020, సెప్టెంబర్‌ 5న ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 19న నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాదాపు 43 లక్షల మందికి మూడు జతల యూనిఫారమ్‌ (వస్త్రం), టెస్ట్‌ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్‌ పంపిణీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.648.09 కోట్లు వెచ్చించనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్‌ ఆసరా పథకానికి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : డ్వాక్రా మహిళలకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను చెల్లించేందుకు
Published date : 21 Aug 2020 12:40PM

Photo Stories