Skip to main content

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

2,059 వ్యాధులకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు’ ప్రారంభమైంది.
Current Affairsపశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక విప్లవం అని, ఈ దిశగా దేశంలోని 28 రాష్ట్రాలకన్నా మిన్నగా మరో అడుగు ముందుకు వేస్తూ.. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రకటించారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
  • ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ 1,059 రోగాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు 2,059కి పెంచుతూ పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం.
  • మూడు నెలలపాటు ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని అధిగమించి ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాకు విస్తరిస్తూ వెళతాం.
  • ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అదనంగా 200 రోగాలకు చికిత్సను విస్తరిస్తూ 1,259 వ్యాధులకు ఈ పథకం కింద చికిత్స అందిస్తాం.
  • ఏటా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నాం. ఈ మేరకు కోటి 42 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 వేల నుండి 50 వేల మంది ఆశావర్కర్లను గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకువచ్చి వారికి 300 -350 ఇళ్లను కేటాయిస్తాం. ఈ ఇళ్లకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలు వారి చేతిలో పెడతాం.
  • ఇకపై ఆరోగ్యశ్రీలోకి క్యాన్సర్ చికిత్సను కూడా చేరుస్తున్నాం.
  • ఆరోగ్యశ్రీ కార్డులపై క్యూ ఆర్ బార్ కోడ్ ఇస్తున్నాం. కార్డు దారునికి సంబంధించిన మొత్తం మెడికల్ రిపోర్టులన్నీ ఆ కార్డులో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నాం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : 2,059 వ్యాధులకు చికిత్స అందించేందుకు

మాదిరి ప్రశ్నలు
Published date : 04 Jan 2020 06:03PM

Photo Stories