ఉగ్రవాదంపై చర్యల్లో పాక్ విఫలం : ఎఫ్‌ఏటీఎఫ్
Sakshi Education
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) తాజా నివేదిక వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలన్నీ పాక్ తుంగలో తొక్కిందని ఎఫ్‌ఏటీఎఫ్ మండిపడింది. పాక్ తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యలు 40లో 31 ఎఫ్‌ఏటీఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చింది.
అంతర్జాతీయంగా మనీలాండరింగ్ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించే ఎఫ్‌ఏటీఎఫ్ 2018 ఏడాదిలోనే పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. ఈ ఏడాది గ్రే లిస్ట్ నుంచి పాక్‌ను బ్లాక్ లిస్ట్‌కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు పారిస్‌లో 2019, అక్టోబర్ 13 నుంచి జరగనున్నాయి.

Published date : 09 Oct 2019 06:04PM