Skip to main content

ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

విశాఖపట్నం-విజయవాడ మధ్య వారానికి 5 రోజుల పాటునడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701/02) ప్రారంభమైంది.
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్ 26న రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు 9 ఏసీ డబుల్ డెక్కర్ కోచ్‌లు, 2-మోటార్ పవర్‌కార్‌లతో నడుస్తుంది. రైల్వేల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడం ద్వారా మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర అంగడి పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 27 Sep 2019 05:46PM

Photo Stories