Daily Current Affairs in Telugu: 2022, జూన్ 17th కరెంట్ అఫైర్స్
Radha Iyengar holds a key position in the US Department of Defense: అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్
ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నారు. మరో ఇండియన్ అమెరికన్ గౌతమ్ రానా స్లొవేకియాలో అమెరికా రాయబారిగా నియమితులు కానున్నారు.
అసలు ఎవరు ఈ రాధా అయ్యంగార్ ?
ఎకనామిక్స్‌లో ఎంఎస్, పిహెచ్‌డి పూర్తి చేసిన ఆమె లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పని చేశారు. రాధా అయ్యంగార్ ప్రస్తుతం డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. చీఫ్‌స్టాఫ్‌గా నియమకానికి ముందు.. ఆమె ప్రముఖ సంస్థ అయిన గూగుల్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ కోసం రీసెర్చ్ అండ్ ఇన్‌సైట్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Aspirational District Programme Should Be Extended to Block and City Levels: Modi- ఆకాంక్ష జిల్లాల పథకం(ఏడీపీ)ను బ్లాకులు, నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు.
- ఆకాంక్ష జిల్లాల పథకం(ఏడీపీ)ను బ్లాకులు, నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. అవి స్ఫూర్తిదాయ జిల్లాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘‘దేశ వ్యాప్తంగా 112 వెనకబడ్డ జిల్లాల్లో కేంద్రం 2018 నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో విజయవంతమైంది’’ అన్నారు.
- హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని గురువారం మాట్లాడారు. టీచర్లు డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ యాప్‌లతో విద్యాబోధనను బలోపేతం చేయాలన్నారు. రిటైర్డ్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం ప్రత్యేకంగా టీవీ చానల్ అవసరం ఉందని చెప్పారు.
The eyelid of the famous Urdu scholar Narang: ప్రముఖ ఉర్దూ పండితుడు నారంగ్ కన్నుమూత
ప్రముఖ ఉర్దూ పండితుడు, సాహితీవేత్త గోపీచంద్ నారంగ్(91) కన్నుమూశారు. సునిశిత విశ్లేషణలతో గాలిబ్, ఫయీజ్ కవితలకు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన ఆయనకు భారత్‌తోపాటు పాకిస్తాన్‌లో ఎందరో అభిమానులున్నారు. అమెరికాలోని చార్లొట్టెలో ఉంటున్న తన కుమారుడి ఇంట ఆయన కన్నుమూశారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ల్లో ఆయన 60కి పైగా పుస్తకాలు రాశారు. భారత ప్రభుత్వ పద్మశ్రీ, పద్మభూషణ్‌లతోపాటు, సితారా–ఇ–ఇంతియాజ్‌తో పాక్ ప్రభుత్వం నారంగ్‌ను గౌరవించాయి.
Commonwealth Games: కామన్వెల్త్ కు జ్యోతి యర్రాజి
- బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) జూన్ 16(గురువారం) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగుతున్నాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో నీరజ్ స్వర్ణం సాధించాడు.
- మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి తొలిసారి సీడబ్ల్యూజీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల వరుసగా మూడు జాతీయ రికార్డులతో జ్యోతి అద్భుత ఫామ్‌లో ఉంది. అన్నింటికి మించి హైజంప్‌లో జాతీయ రికార్డు సాధించడంతో పాటు సులువుగా క్వాలిఫయింగ్ మార్క్‌ను అందుకున్న తేజస్విన్ శం కర్‌ను ఏఎఫ్‌ఐ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత వారమే అతను యూఎస్‌లో ఎన్‌సీఏఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో 2.27 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించాడు. నిబంధనల ప్రకారం ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో తేజస్విన్ పాల్గొని ఉండాల్సి ఉందని... అతను ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండేందుకు కనీసం తమనుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే పక్కన పెట్టామని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదిల్ సమరివాలా స్పష్టం చేశారు.