Daily Current Affairs in Telugu: 2022, జూన్ 14th కరెంట్ అఫైర్స్
What happened in the National Herald scandal case: నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కేసులో జరిగిందిదీ..
ఒకపక్క దేశమంతా 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలు జరుగుతుంటే మరోపక్క స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కుంభకోణం వివాదంలో నిండా మునిగి తేలుతోంది. ఈ ఉదంతంలో వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ అగ్రనాయకత్వం కారుచౌకగా కొట్టేసిన వైనం ఆ పార్టీ అక్రమార్జనకు పరాకాష్ట.
ఏమిటీ నేషనల్ హెరాల్డ్?
- స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రజలకు దేశీయ వాణి వినిపించాలన్న ఉద్దేశంతో నెహ్రూ సహా పలువురు జాతీయ నాయకులు రూ.5 లక్షల మూలధనంతో 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు.
- 1937 నవంబర్ 20న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అనే అన్ లిస్టెడ్ కంపెనీని ఆరంభించారు. దాదాపు 5వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇందులో వాటాదారులు.
- రూ.5 లక్షల మూలధనాన్ని 2 వేల ప్రిఫరెన్షియల్ షేర్లుగా, 30 వేల ఈక్విటీ షేర్లుగా విభజించారు. ఒక్కో ప్రిఫరెన్షియల్ ముఖ విలువ రూ.100, ఈక్విటీ షేరు విలువ రూ.10గా నిర్ణయించారు.
వేల కోట్ల ఆస్తులు.. రూ.90 కోట్ల నష్టాలు
- ఏజేఎల్ నిబంధనల ప్రకారం కంపెనీ ఏ ఒక్కరికీ సొంతం కాదు. వార్తా పత్రిక నిర్వహణ తప్ప ఇతర వ్యాపారాల్లో వేలు పెట్టకూడదు.
- ఇంగ్లిష్‌లో నేషనల్ హెరాల్డ్, ఉర్దూలో ఖౌమీ ఆవాజ్, హిందీలో నవ్‌జీవన్ పత్రికలను ఏజేఎల్ 2008 దాకా ప్రచురించింది.
- స్వాతంత్య్రానంతరం పత్రికకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దాంతో ఏజేఎల్ ఆదాయం తగ్గుతూ వచ్చి చివరకు నష్టాల్లో మునిగింది. మరోవైపు కంపెనీ వాటాదారులు 2010 నాటికి 1,057కు తగ్గిపోయారు.
- అయితే స్వాతంత్రోద్యమకాలంలో ఉన్న ఆదరణ కారణంగా ఏజేఎల్‌కు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీగా స్థిరాస్తులు సమకూరాయి.
- ఈ ఆస్తుల విలువ స్వాతంత్రానంతరం భారీగా పెరిగింది. పత్రికలను మూసేసేనాటికి దాదాపు రూ.5వేల కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ నికర నష్టం రూ.90 కోట్లకు చేరింది.
- వేల కోట్ల ఆస్తులున్న ఏ సంస్థా రూ.90 కోట్ల నష్టాలకు కంపెనీని అమ్ముకోవడం, రుణం తీసుకోవడం జరగదు. కానీ ఇక్కడే కాంగ్రెస్ మాయ మొదలైంది.
తెరపైకి యంగ్ ఇండియన్
- 2010 నవంబర్లో కేవలం రూ.5 లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీ పుట్టుకొచ్చింది.
- దీనికి 2010 డిసెంబర్లో రాహుల్‌గాంధీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2011 జనవరిలో సోనియా కూడా డైరెక్టర్ బోర్డులో సభ్యురాలయ్యారు.
- కంపెనీలో 76 శాతం వాటాలు సోనియా, రాహుల్ సొంతం. మిగతా 24 శాతం వాటాలూ కాంగ్రెస్ నేతలు వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేరిటే ఉన్నాయి.
- కాంగ్రెస్ నుంచి రూ.90 కోట్ల వడ్డీ లేని రుణం తీసుకునేందుకు 2011 ఫిబ్రవరిలో ఏజేఎల్ అంగీకరించింది.
- తర్వాత సదరు రూ.90 కోట్ల రికవరీ హక్కులను కేవలం రూ.50 లక్షలకు కాంగ్రెస్ నుం చి యంగ్ ఇండియన్ కొనుగోలు చేసింది. రికవరీ ముసుగులో ఏజేఎల్ షేర్లు దాని పరమయ్యాయి.
స్వామి ఫిర్యాదుతో...
- ఏజేఎల్, యంగ్ ఇండియన్ ఒప్పందంపై సుబ్రమణ్యస్వామి 2012లో ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేశారు.
- కేసు కొట్టేయాలన్న సోనియా తదితరుల అభ్యర్థనను 2014లో కింది కోర్టు, 2015లో ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చాయి.
- సోనియా, రాహుల్, వోరా, ఆస్కార్ తదితరులు కింది కోర్టులో హాజరవాలని హైకోర్టు ఆదేశించింది.
- 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది.
- ఈ వ్యవహారంపై 2014లో ఈడీ దృష్టి సారించింది. 2019లో దాదాపు రూ.64 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.
- ఇలా వేలాది కోట్ల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ అధినాయకత్వం పథకం ప్రకారం చేజిక్కించుకుందన్న వైనం స్పష్టంగా కళ్లముందు కనిపిస్తున్నా ఆ పార్టీ బుకాయిస్తూనే ఉంది. నిజాయతీ నిరూపించుకునే ప్రయత్నాలు చేయకుండా ఇదంతా బీజేపీ కక్ష సాధింపు అంటూ ఆరోపిస్తోంది. పత్రిక పునరుద్ధరణకు రుణమిచ్చామని చెప్పిన కాంగ్రెస్, దాని రికవరీ హక్కులను యంగ్ ఇండియన్‌కు కారుచౌకగా రూ.50 లక్షలకే ఎందుకు కట్టబెట్టిందీ చెప్పలేదు.
ఈ ప్రశ్నలకు బదులేది?
- రూ.5 వేల కోట్ల ఆస్తులున్న కంపెనీ రూ.90 కోట్ల నష్టాలను తీర్చేందుకు రుణమెందుకు తీసుకుంది?
- తన ఆస్తుల్లో ఏదో ఒకదాన్ని విక్రయించో, తాకట్టు పెట్టో రూ.90 కోట్లు ఎందుకు చెల్లించలేదు?
- రూ.90 కోట్ల రుణ రికవరీ హక్కులను యంగ్ ఇండియన్‌కు కేవలం రూ.50 లక్షలకు ఎలా ఇచ్చారు?
- యంగ్ ఇండియన్‌కు ఏదో ఒక ఆస్తి కట్టబెట్టే బదులు ఏకంగా ఏజేఎల్ షేర్లను ఎందుకు కేటాయించారు?
- కేవలం వోరా సంతకాలతో వేలాది కోట్ల ఆస్తులున్న ఏజేఎల్ ఎలా యంగ్ ఇండియన్ పరం ఎలా అయింది?
- ఈ కుంభకోణంతో సంబం ధం లేకపోతే ఈ వ్యవహారాన్ని సోనియా, రాహుల్ ఎందు కు సమర్థించారు?
రూ.5 వేల కోట్ల ఆస్తులున్న కంపెనీ రూ.90 కోట్ల నష్టాలను తీర్చేందుకు రుణమెందుకు తీసుకుంది? - తన ఆస్తుల్లో ఏదో ఒకదాన్ని విక్రయించో, తాకట్టు పెట్టో రూ.90 కోట్లు ఎందుకు చెల్లించలేదు?
- రూ.90 కోట్ల రుణ రికవరీ హక్కులను యంగ్ ఇండియన్‌కు కేవలం రూ.50 లక్షలకు ఎలా ఇచ్చారు?
- యంగ్ ఇండియన్‌కు ఏదో ఒక ఆస్తి కట్టబెట్టే బదులు ఏకంగా ఏజేఎల్ షేర్లను ఎందుకు కేటాయించారు?
- కేవలం వోరా సంతకాలతో వేలాది కోట్ల ఆస్తులున్న ఏజేఎల్ ఎలా యంగ్ ఇండియన్ పరం ఎలా అయింది?
- ఈ కుంభకోణంతో సంబం ధం లేకపోతే ఈ వ్యవహారాన్ని సోనియా, రాహుల్ ఎందు కు సమర్థించారు?
ఔరా.. వోరా!
- యంగ్ ఇండియన్ తరఫున రికవరీ హక్కుల కొనుగోలుకు ప్రతిపాదించిందీ, కాంగ్రెస్ కోశాధికారి హోదాలో అందుకు అంగీకరించిందీ, ఏజేఎల్ ఎండీగా ఒప్పందంపై సంతకం చేసిందీ వోరాయే. తన త్రిపాత్రాభినయంతో ఈ మొత్తం ఉదంతాన్ని రక్తి కట్టించారు.
- చివరకు రూ.50 లక్షలతో అటు రూ.90 కోట్ల అప్పు మాయమైంది. ఇటు వేలాది కోట్ల ఏజేఎల్ ఆస్తులు రాహుల్, సోనియాలకు దక్కాయి.
- ఈ వ్యవహారంలో భారీగా మోసపోయింది ఏజేఎల్ వాటాదారులే! కొత్త ఒప్పందాలతో వీరి వాటాలన్నీ కలిపి ఒక్క శాతానికే పరిమితమయ్యాయి.
- Download Current Affairs PDFs: Click Here
- యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Indian Institute of Science ‘snapping’ sandals can prevent diabetic foot : మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్ చెప్పులు
మధుమేహ(డయాబెటిస్) బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) డిపార్టుమెంట్ ఆఫ్‌మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. ఇందుకు కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్(కేఐఈఆర్) తగిన సహకారం అందించింది. డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు పుండ్లు పడితే త్వరగా మానవు. దాంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఒక్కోసారి కాలు తొలగించే పరిస్థితి కూడా రావొచ్చు. ఇలాంటి వారి కోసం ఐఐఎస్సీ పరిశోధకులు రూపొందించిన 3డీ ప్రింటెడ్ చెప్పులు చక్కగా పనిచేస్తాయి. కాలు ఎలాంటి ఆకృతిలో ఉన్న దానికి అనుగుణంగా మారిపోవడం వీటి ప్రత్యేకత. నడకను బట్టి చెప్పులు వాటంతట అవే సరిచేసుకుంటాయని పరిశోధకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ చెప్పులు ధరిస్తే కాళ్లకు గాయాలయ్యే అవకాశాలు చాలా స్వల్పమేనని అన్నారు. ఒకవేళ అప్పటికే గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి ఈ చెప్పులు ఉపయోగపడతాయని వివరించారు.
Andhra Pradesh boy shines in World Youth Weightlifting Tournament : ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు
- అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి తెలుగు తేజం మెరిసింది. ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు శనపతి గురునాయుడు పసిడి పతకంతో అదరగొట్టాడు. గురునాయుడు ప్రతిభతో ఈ టోర్నీలో భారత్‌కు బంగారు పతకాల బోణీ లభించింది. మెక్సికోలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురునాయుడు బాలుర 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 104 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 230 కేజీలతో గురునాయుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
- సౌదీ అరేబియా లిఫ్టర్ మాజీద్ అలీ (229 కేజీలు; స్నాచ్‌లో 105+క్లీన్ అండ్ జెర్క్‌లో 124) రజతం... కజకిస్తాన్ లిఫ్టర్ యెరాసిల్ ఉమ్రోవ్ (224 కేజీలు; స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 124) కాంస్యం సాధించారు. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ నాలుగు పతకాలు సాధించింది. బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య కాంస్యం గెలిచింది. సౌమ్య స్నాచ్‌లో 65 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 148 కేజీలతో మూడో స్థానంలో నిలి చింది. ఆకాంక్ష (40 కేజీలు), విజయ్ ప్రజాపతి (49 కేజీలు) రజత పతకాలు గెలిచారు.
‘లిఫ్ట్’ చేస్తే పతకమే...
- వేదిక ఏదైనా బరిలోకి దిగితే గురునాయుడు పతకంతోనే తిరిగొస్తున్నాడు. తాష్కెం ట్‌లో జరిగిన 2020 ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో గురు 49 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు 2019లో తాష్కెంట్‌లోనే జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో రజతం గెలిచాడు. గత మూడేళ్లుగా జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో గురు పసిడి పతకాల పంట పండిస్తున్నాడు.
- 2020లో బుద్ధగయలో జాతీయ పోటీల్లో అతను స్వర్ణం సాధించడంతోపాటు ఐదు రికార్డులు నెలకొల్పాడు. 2021లో పంజాబ్‌లో, ఈ ఏడాది జనవరిలో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో గురునాయుడు బంగారు పతకాలు గెలిచాడు. ‘ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించడం, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్ అధికారి కావడం తన జీవిత లక్ష్యాలు’ అని సోమవారం మెక్సికో నుంచి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ గురునాయుడు పేర్కొన్నాడు.
తండ్రి కలను నిజం చేస్తూ...
గురునాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చంద్రంపేట. అతని తండ్రి రామస్వామి గ్రామీణ క్రీడల్లో రాణించేవారు. ఆ రోజుల్లోనే బాడీబిల్డర్‌గా, వెయిట్‌లిఫ్టర్‌గా పేరుపొందారు. పేదరికం వల్ల తన అభిరుచికి మధ్యలోనే స్వస్తి పలకాల్సి వచ్చింది. తన ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన గురునాయుడిని మాత్రం వెయిట్‌లిఫ్టర్‌గా చేయాలని తపించారు. తన ఆశయాన్ని తన కుమారుడి ద్వారా సాధించాలనే లక్ష్యంతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన చల్లా రాము వద్ద శిక్షణకు పంపించారు. అలా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు దిద్దిన గురునాయుడు సికింద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్మీ స్కూల్‌లో సీటు సాధించాడు. సీబీఎస్‌ఈ పదో తరగతిలో ‘ఎ’ గ్రేడ్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడే ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతూ కోచ్ దేవా వద్ద శిక్షణ పొందుతున్నాడు. తమ కుమారుడు గురునాయుడు సాధించిన విజయంతో తల్లిదండ్రులైన రామస్వామి, పాపయ్యమ్మ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
Danger warning on every cigarette in Canada: కెనడాలో ప్రతి సిగరెట్‌పై ప్రమాద హెచ్చరిక
ప్రతి సిగరెట్‌పైనా ప్రమాద హెచ్చరికను ముద్రించాలని కెనడా నిర్ణయించింది. ఇలా చేస్తున్న తొలి దేశంగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై గ్రాఫిక్ చిత్ర హెచ్చరికలను ముద్రించి కెనడా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.