థాయ్‌లాండ్ ప్రధానిగా ప్రయూత్ చాన్
Sakshi Education
థాయ్‌లాండ్ ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్ చాన్ ఓచా ఎన్నికయ్యారు.
సమీప ప్రత్యర్థి థనాత్రోన్ జువాంగ్రోంగ్ రువాంకిట్‌పై ఆయన విజయం సాధించారు. 2014లో ఇంగ్లక్ షీనవత్ర ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌరప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా నిలిచారు. ధాయ్‌లాండ్‌లో ప్రధానిని ఎన్నుకోవడానికి ప్రతినిధుల సభ, సెనెట్ కలిపి 375 సభ్యుల మద్దతు ఉండాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : థాయ్‌లాండ్ ప్రధానిగా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రయూత్ చాన్ ఓచా
క్విక్ రివ్యూ :
ఏమిటి : థాయ్‌లాండ్ ప్రధానిగా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రయూత్ చాన్ ఓచా
Published date : 06 Jun 2019 05:43PM