Skip to main content

ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 19న ఫోన్‌లో పలు అంశాలపై చర్చలు జరిపారు.
దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో మోదీ మాట్లాడుతూ.. దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం ఉగ్రవాదం, హింసలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరముందన్నారు. ఉగ్రబాటను వీడి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై పోరాడే ఏ దేశానికైనా భారత్ పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370 రద్దుతో భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు, జాత్యహంకారిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభివర్ణించడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్‌చేసిన ట్రంప్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

అఫ్గాన్‌కు అండగా నిలుస్తాం..
అఫ్గానిస్తాన్‌లో శాంతి, సుస్థిరత, భద్రత కోసం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని మోదీ తెలిపారు. ఆగస్టు 19న అఫ్గానిస్తాన్ 100వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో అఫ్గాన్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో చర్చలు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : భారత్-పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో
Published date : 20 Aug 2019 05:06PM

Photo Stories